టేకులపల్లిలో న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన డి.ఎస్.పి

 

 

టేకులపల్లి, నవంబర్ 18( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిని కొత్తగూడెం డిసిసి ఆర్.బి డిఎస్పి నందిరాం నాయక్ శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్ శంకర్ నాయక్, డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నిర్వహణ జరుగుతుంది. ఈ వైద్యశాలలో నలుగురు వైద్యులు ఉంటారని, నిత్యం అందుబాటులో ఉంటారని అన్నారు. బెడ్స్ తో పాటు అన్ని ఎక్యుమెంట్స్ ఆస్పత్రిలో ఉన్నాయని అన్నారు. ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో దూరప్రాంతాలకు వెళ్లలేని వారందరికీ అందుబాటులో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు. ప్రైవేటు వైద్యశాల అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన పేదలే ఉంటారు కనుక కొంత సేవా దృక్పథంతో ఈ వైద్యశాల ద్వారా ఆదుకోవాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి ఎస్సై భూక్య శ్రీనివాస్, వాంకుడోత్ సీతారాములు,స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.