టేకులపల్లి లో ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర
– ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య
టేకులపల్లి, ఆగస్టు 14( జనం సాక్షి ): అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా ఇల్లందు నియోజకవర్గ లోని టేకులపల్లి మండలంలో ఆజాది కా గౌరవ్ పాదయాత్రను ఆదివారం భద్రాచలం శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోదెం వీరయ్య ప్రారంభించారు . ఈ పాదయాత్రను గోల్యాతండా సమీపంలోని పెట్రోల్ బంక్ నుండి పాదయాత్ర ప్రారంభమై టేకులపల్లి ప్రధాన సెంటర్ వరకు నిర్వహించారు . ఈ పాదయాత్రలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు . కాంగ్రెస్ నాయకులు భూక్య దల్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్ రావు, చీమల వెంకటేశ్వర్లు, భూక్య మంగిలాల్ నాయక్,డాక్టర్ రవి , మాజీ సర్పంచ్ ఇస్లావత్ రెడ్యా నాయక్, టేకులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండా నరసింహ రావు,డానియల్ ,ఎంపీటీసీ రామ కృష్ణ , వెంకట్, మండల మహిళా అధ్యక్షురాలు ఆకారపు స్వప్న ,ఎనగంటి అర్జున్ రావు, అజ్మీర సుక్యా, వెంగళరావు , శ్రీనివాసరావు, జాఫర్,ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.