టేకులపల్లి లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
టేకులపల్లి, ఆగస్టు 20( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బోడు రోడ్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు, భూక్యా దళ్ సింగ్ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్, టేకులపల్లి మాజీ సర్పంచ్ ఇస్లావత్ రేడ్యా నాయక్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎనగంటి అర్జున్ రావు, నరసింహారావు, బాలాజీ నాయక్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.