టోక్యో రివర్‌ఫ్రంట్‌ను పరిశీలించాం

` ఇదే తరహాలో మూసీ నది ప్రక్షాళన
` పునరుద్ధరణనను అడ్డుకునే కొందరి కుట్ర
` అభివృద్దిలో ప్రపంతో తెలంగాణ పోటీ
` ఢల్లీి పరిస్థితులు చూసి గుణపాఠం తెచ్చుకోవాలి
` జపాన్‌ తెలుగు సమాఖ్య సదస్సులో సిఎం రేవంత్‌
టోక్యో(జనంసాక్షి):అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌.. శనివారం జపాన్‌ తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో జపాన్‌లోని తెలుగు వారు భాగం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామని.. రాష్ట్రంలో త్వరలోనే డ్రై పోర్ట్‌ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. టోక్యోలో రివర్‌ ఫ్రంట్‌ను పరిశీలించామన్నారు. మూసీనది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఢల్లీి పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్‌, రేడియల్‌ రోడ్స్‌ తెలంగాణ పురోగతికి కీలకమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని.. ప్రపంచంతో పోటీ-పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఐటీ-, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్‌ రింగ్‌ రోడ్‌, రేడియల్‌ రోడ్స్‌ తెలంగాణ పురోగతికి కీలకం. తెలంగాణకు పెట్టుబడులు రావాలి.. పరిశ్రమలు పెరగాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్ర అభివృద్ధిలో అందరి సహకారం అవసరం. విూ తోడ్పాటు-తో ప్రపంచంతోనే మనం పోటీ- పడొచ్చు. ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం విూకు తెలుసని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగావకాశాలు
రెండు జపనీస్‌ సంస్థలతో టామ్‌ కామ్‌ ఒప్పందాలు
రాబోయే రెండు సంవత్సరాలలో సుమారు 500 మందికి ఉపాధి కల్పనకు అవకాశం
టోక్యో(జనంసాక్షి):తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్‌ మాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌ కామ్‌) జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చు కుంది. టెర్న్‌ (టీజీయూకే టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌), రాజ్‌ గ్రూప్‌ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంది. జపాన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం ఆ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. తెలంగాణలో నైపుణ్యమున్న నిపుణులను జపాన్‌లోని అధిక డిమాండ్‌ ఉన్న రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెర్న్‌ గ్రూప్‌ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్‌వేర్‌, ఇంజనీరింగ్‌, స్కిల్డ్‌ వర్కర్‌ రంగాలలో అంతర్జాతీయ నియామకాలు చేపడుతుంది. రాజ్‌ గ్రూప్‌ జపాన్‌లో పేరొందిన నర్సింగ్‌ కేర్‌ సంస్థ త్సుకుయి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో గతంలో టామ్‌ కామ్‌ తో కలిసి పని చేసింది. కొత్త ఒప్పందంతో హెల్త్‌ కేర్‌ రంగంలో పాటు ఇతర రంగాల్లోనే సహకారం విస్తరించనుంది. ఈ రెండు జపనీస్‌ సంస్థలు రాబోయే ఒకటి నుండి రెండు సంవత్సరాలలో సుమారు 500 ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి. హెల్త్‌ కేర్‌, నర్సింగ్‌ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్‌ రంగంలో (ఆటోమోటివ్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) 100 ఉద్యోగాలు, హాస్పిటాలిటీ రంగంలో 100 ఉద్యోగాలు, మరియు నిర్మాణ రంగంలో (సివిల్‌ ఇంజనీరింగ్‌, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామగ్రి నిర్వహణ మరియు నిర్వహణ) 100 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. యువతకు నైపుణ్యాల శిక్షణతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు ఈ ఒప్పందాలు అద్దం పట్టాయి.

తాజావార్తలు