ట్రంప్ నచ్చకపోతే దేశం వదిలేయండి.!!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆందోళనకారులకు దిమ్మదిరిగే సమాధానమిచ్చారు ఫెడరల్ మెజిస్ట్రేట్ జడ్జ్ జాన్ ప్రైమోమొ. శాన్ ఆంటోనియోలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్సన్ కల్చర్స్ ముందు గుమిగూడిన వందల మంది వలసదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మీరు ఆయన (ట్రంప్)కు ఓటేసినా, వేయకపోయినా అమెరికా పౌరుడిగా ఆయనే మీ అధ్యక్షుడు. ఆయనే కొనసాగుతారు. మీకు అది నచ్చకపోతే మరో దేశానికి వెళ్లిపోండి అని కాస్త కఠినంగానే హెచ్చరించారు జడ్జి జాన్. ఆయన మా అధ్యక్షుడు కాడు అంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని జాన్ తీవ్రంగా విమర్శించినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది.