ట్రాక్టర్ పైనుంచి పడి వ్యక్తి మృతి
విజయవాడ,సెప్టెంబర్27(జనంసాక్షి):కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని మద్దూరు కరకట్టపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పలూరు గ్రామానికి చెందిన హనుమంతరావు అనే వ్యక్తికి ట్రాక్టర్ ఉంది. ఆయన రొయ్యూరు పరిధిలోని ఇసుక క్వారీలో ఇసుకను రవాణా చేసేందుకు ట్రాక్టర్‌పై డ్రైవర్‌తో వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద ట్రాక్టర్ పైనుంచి కింద పడ్డాడు. రోడ్డు విూద పడిన హనుమంతరావుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హనుమంతరావు మృతితో ఉప్పలూరులో విషాదఛాయలు అలముకున్నాయి.