ట్రాక్టర్ బోల్తా కౌలు రైతు దుర్మరణం
కూసుమంచి ఆగస్టు 13 ( జనం సాక్షి ) : మండలంలోని నాయకునిగూడెం గ్రామంలో ట్రాక్టర్ తిరిగిపడి కౌలు రైతు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే మంగలి తండా గ్రామ నివాసస్థుడైన గుగులోత్ హనుమంతు (41) నాయక్ గూడెం రెవెన్యూ పరిధిలోని కారంశెట్టి మోహన్ రావు పొలమును కౌలుకు చేస్తున్నాడు దాన్లో భాగంగా ఈరోజు పొలమును దమ్ము చేయుచుండగా ట్రాక్టర్ దిగబడటంతో బురదలో దిగబడిన ట్రాక్టర్ తీయుటకు వేరే ట్రాక్టర్ను తీసుకువచ్చి దానిని తీసే క్రమంలో ట్రాక్టర్ తిరగబడటంతో దానిపై ఉన్న హనుమంతు ట్రాక్టర్ కిందపడి దుర్మరణం పాలయ్యాడు మృతునికి ఒక పాప, ఒక బాబు సమాచారం అందుకున్న పోలీసు వారు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు.