ట్రాన్స్ పఫిసిక్ వాణిజ్య సంబంధాలకు చెక్ – ట్రంప్
వైట్‌హౌజ్‌కు చేరుకున్న తొలి రోజే ట్రాన్స్ పఫిసిక్ వాణిజ్య సంబంధాలకు చెక్ పెట్టనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన ట్రంప్ వచ్చే జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే తాను ఆఫీసుకు వచ్చిన తొలి రోజే ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం కింద 12 దేశాలతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయనున్నట్లు ట్రంప్ తన వీడియో మెసేజ్‌లో పేర్కొన్నారు. ఉద్యోగాలను తగ్గిస్తున్న అంశంపైన కూడా ఆంక్షలను తొలిగించనున్నట్లు రిపబ్లికన్ నేత చెప్పారు. ఒబామాకేర్, మెక్సికో బోర్డర్ వద్ద గోడ నిర్మాణం లాంటి అంశాలపై ట్రంప్ ఆ వీడియోలో స్పందించలేదు. టీపీపీ ఒప్పందం 2015లో జరిగింది. జపాన్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సిక్ దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.