ట్రాస్మా తీరు ఆక్షేపణియం
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్.
బెల్లంపల్లి, అక్టోబర్ 23, (జనంసాక్షి)
విద్యార్థి సంఘాలపై ట్రాస్మా పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆక్షేపణియమని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి ఆయన మాట్లాడుతూ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రయివేటు విద్యా సంస్థలు, వాటి తప్పులను కప్పిపుచ్చుకునేందుకే విద్యార్థి సంఘాలపై అభాండాలు వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థి సంఘాలను అదుపు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం దొంగే దొంగ దొంగా అని అరిచినట్టు ఉందన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రయివేటు విద్యా సంస్థలు తమతమ ఆగడాలకు ఆపివేయాలని హెచ్చరించారు. ప్రయివేటు విద్యా సంస్థల ఆగడాలను ఎండగట్టితే విద్యార్థి సంఘాలపై పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. నిబంధనల ప్రకారం ప్రయివేటు విద్యా సంస్థలు పనిచేస్తే ఏ ఒక్క సంస్థ కూడా నడవదని అన్ని మూతపడుతాయని అన్నారు. ట్రాస్మా ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి సంఘాలు వేధిస్తే ఆసంస్థల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.