డబుల్ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ
ప్రతి నియోజకవర్గంలో పేదలకు అందచేస్తాం
దీనిని అడ్డంపెట్టుకుని కూటమి నేతల విమర్శలు
ఉమ్మడి జిల్లాలో పదికిపది స్థానాలు గెలుస్తాం: తుమ్మల
ఖమ్మం,నవంబర్23(జనంసాక్షి): డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం వేగంగా సాగుతోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఎన్నికల్లో కొందరు అదేపనిగా దీనిపై దుష్పచ్రారం చేస్తున్నారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయని అన్నారు. దీనిని బూచిగా చూపి లబ్దిపొందాలన ఇకాంగ్రెస్ కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫళించవని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హావిూ మేరకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి తీరుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 400 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, అట్లాగే పట్టణ ప్రాంతాలకు పట్టణ పేదల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లోనూ పట్టణాలకు ఇళ్ల నిర్మాణాల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో రహదారులకు మహర్దశ పట్టనుందని అన్నారు. రహదారి సౌకర్యంలేని అన్ని గిరిజన తండాలకు రహదారులను మంజూరు చేసినట్లు చెప్పారు. రానున్నరోజుల్లో గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని హావిూనిచ్చారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి నాలుగు చొప్పున గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేస్తోందన్నారు.కేంద్రం అనేక పథకాలకు ఆమోదం తెలిపిందన్నారు. ఆయా రహదారలుకు నిధులుమంచూరైతే కేంద్ర సాయంతో వీటిని పూర్తి చేస్తామని అన్నారు.ఇటీవల సిఎం కెసిఆర్‌తో కలసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రహదారుల విస్తరణ,కొత్తవాటి నిర్మాణాలప చర్చించామని అన్నారు. కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. ప్రతీ మండలానికి ఒక గురుకుల విద్యాలయాన్ని స్థాపించేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించేందుకు కృషి చేస్తున్నామని పాలేరు అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.గతంలో ప్రజలకు సేవచేసిన చరిత్రలేని వారు వచ్చి ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికలు అయిపోగానే కంటి కనిపించని నాయకులు ఓట్లు అడిగే హక్కులేదన్నారు. ప్రతిక్షణం విూకు అందుబాటులో ఉండే నాయకున్నే ఎన్నుకోవాలన్నారు. మరోసారి గెలిపిస్తే పాలేరును రాష్ట్రంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉంచుతామన్నారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను గెలిపించుకునే బాధ్యత తనపై ఉందన్నారు. దానివలనే నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తిరగకపోయిన విూరే పూర్తి బాధ్యత తీసుకుని మెజార్టీ వచ్చే విధంగా కృషిచేయాలన్నారు. రెండు సంవత్సరాల కాలంలో
పాలేరును నెంబర్‌వన్ స్థానంలో ఉంచినట్లు తెలిపారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి పక్కారాష్ట్ర సీఎం అడ్డుకున్నా వాటిని అధిగమించి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులన్ని పూర్తిచేస్తానన్నారు. సీఎం కేసీఆర్ తనపై, ఎంపీ పొంగులేటిపై మరింత బాధ్యత పెట్టారని, దానిని దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు.