డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి);
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.చందు నాయక్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది ఆదివారం గద్వాల లోని డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసి ,పలు రికార్డులను, రిపోర్టులను, పరిశీలించారు.
డయాగ్నస్టిక్ సెంటర్/ల్యాబ్ నిర్వాహకులు అందరూ క్వాలిఫైడ్ డాక్టర్ రెఫెర్ చేసిన వ్యక్తి నుండి మాత్రమే , క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ,టెస్టుల ప్రకారం బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి, మళ్లీ బ్లడ్ శాంపిల్ రిపోర్టు, రెఫెర్ చేసిన డాక్టర్ కి అదే వ్యక్తి ద్వారా పంపించి రోగనిర్ధారణ చేసుకునేటట్లు చేయాలని, ల్యాబ్ నిర్వాహకులు ఎవరు కూడా ఆర్ఎంపీలు రెఫెర్ చేసిన వ్యక్తుల నుండి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి రిపోర్టు చూసి నిర్ధారణ చేయరాదని అలా చేసినచో హాస్పిటల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని, డయాగ్నస్టిక్ సెంటర్/ల్యాబ్ రికార్డుల నిర్వహణ, రిపోర్టు ల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలోని ఆర్ఎంపీలు అందరూ ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రి తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ లో 57 రకాల టెస్టులు ఉచితంగా చేస్తున్నామని , జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రతిరోజు తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ వెహికల్స్ ద్వారా రోగులకు సంబంధించిన బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి, రిపోర్టును అదే రోజు బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసిన వ్యక్తి మొబైల్ ఫోన్ నెంబర్ కు రిపోర్టును పంపిస్తున్నామని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది ఓ ఎస్ డి డాక్టర్. పి. రవికుమార్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ కోట్ల మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.