డాక్టర్ వన్నాల ఆధ్వర్యంలో.. పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి)

పండిట్ దీన్ దయాల్ జయంతి సందర్భంగా వరంగల్ లో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.డాక్టర్ వన్నాల వెంకటరమణ మాట్లాడుతూ అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్ 25న జన్మించి అసమాన్య వ్యక్తిగా .. ఒక శక్తి గా ఎదిగిన మహనీయుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ.కొందరు మరణించే వరకు జీవిస్తారు మరికొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు ఆ రెండోకోవకు చెందినవారు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. సమగ్ర మానవతా భావజాలం యొక్క ప్రతిపాదకుడు మరియు భారతీయ జనతా పార్టీ యొక్క పూర్వపు రాజకీయ పార్టీ భారతీయ జన సంఘ్ నాయకుడు.పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలు, ఆచరణీయత సమాజంలోని ప్రతి వ్యక్తికి ఆదర్శనీయం. అట్టడుగునా ఉన్న వ్యక్తికే తొలి ప్రభుత్వ ప్రయోజనం చేకూరాలన్నా వారి అంత్యోదయ ప్రేరణ, ఏకాత్మ మానవతావాదం అందుకు నిదర్శనం.వ్యక్తి ,సమాజం వేరు వేరు కావని ,రెండింటిలో ఒకే ఆత్మ ఉంటుందంటూ భారత సమగ్ర అభివృద్ధికై పాటుపడిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మానీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు.. సముద్రాల పరమేశ్వర్ మార్టిన్ లూథర్ జన్ను సుబ్రహ్మణ్యం,ముండ్రాతి వెంకటేశ్వర్లు , సంఘ ని జగదీశ్వర్, చిలువేరు రాజేందర్, ఉదయ్ సింగ్ , కమలాకర్, రాజకుమార్ , గాదె రవీందర్ , ప్రభాకర్ గుప్తా లక్ష్మణ్ , బొడ్డు.రాకేష్, శివ, రమేశ్, దేవు . సాంబయ్య మరియు ఇతర జిల్లా నాయకులూ పాల్గొన్నారు.