డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మారక పురస్కారం -2023 అందుకున్న కోమటి మత్స్యగిరి

నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్.వి.ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లొ పుడమి సాహితీ వేదిక తెలంగాణ వారి ఆధ్వర్యం లో పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డీ అధ్యక్షతన జరిగిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మోత్కూరు కి చెందిన కోమటి మత్స్య గిరి తెలుగు పండితులు (లిటిల్ ఫ్లవర్ స్కూల్) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మారక పురస్కారాన్ని ప్రముఖ కవులు శ్రీనాధుడు,భక్త రామదాసు,గిడుగు రామమూర్తి,ప్రముఖ కవయిత్రి మొల్ల వారసుల చేతుల మీదుగా అందుకున్నారు. మత్స్య గిరి తెలుగు పండితులుగా,ఛత్రపతి కలం పేరుతో వివిధ రచనలు చేస్తూ,తెలుగు భాషా అభివృద్ధికి పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం పట్ల పుడమి సాహితీ వేదిక సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మారక పురస్కారం 2023 కి ఎంపిక చేసినట్లు మత్స్య గిరి తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనాథుడి వంశీయులు కావూరి శ్రీనివాస్ శర్మ, భక్త రామదాసు 10 వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాస రావు, గిడుగు రామమూర్తి 4వ తరం వారసుడు గిడుగు వెంకటేశ్వర శర్మ, మొల్ల 14వ తరం వారసుడు మున్నెల్లి శివ శంకరయ్య చేతుల మీదుగా మెమెంటో,ప్రశంసాపత్రం, శాలువా తో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మారక పురస్కారాన్ని కోమటి మత్స్యగిరి అందుకున్నారు.

తాజావార్తలు