డిఇవో కార్యాలయం ఎదుట టీచర్ల నిరసన
శ్రీకాకుళం,సెప్టెంబర్28(జనంసాక్షి ):యుటిఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం డిఇఒ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యవైఖరిని విడిచిపెట్టి, ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హరిజన స్టేట్ సెక్రటరీ గొంటి గిరిధర్, జిల్లా ప్రెసిడెంట్ తెడ్డి మోహనరావు, సెక్రటరీ చౌదరి రవీంద్రలు పాల్గొన్నారు.