డిఎస్సీ-2012లో 761మందిని ఎంపిక
కరీంనగర్, డిసెంబర్ 1 : డిఎస్సీ-2012లో ఎంపికైన అభ్యర్థుల జాబితా సి.డి.ని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ శనివారం కలెక్టర్‌క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిఎస్సీ-2012లో 761మందిని ఎంపిక చేసినట్లు, ఇందులో 735మంది తెలుగుమీడియం, నలుగురు ఉర్దూ మీడియం, 22మంది గిరిజన సంక్షేమ శాఖకు చెందినవారు ఎంపికైనట్లు తెలిపారు. జిల్లాఓల 800పోస్టులు నోటిఫై చేశామని, వీరిలో 765మంది తెలుగు మీడియం, 13 ఉర్దూ మీడియం, 22మంది గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన వారిని నోటిఫై చేశామని తెలిపారు. సరైన అభ్యర్థులు లభించనందున 39 పోస్టులు భర్తీ చేయలేకపోయినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా విద్యాధికారి లింగయ్య మాట్లాడుతూ డిఎస్సీ ఎంపికైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు డిసెంబర్ 3న, ల్యాంగ్వేజ్ పండిట్స్, పి.ఇ.టిలకు డిసెంబర్ 4న, ఎస్.జి.టి.లకు డిసెంబర్ 5న, ఓల్డ్ హైస్కూల్ ముకారాంపూర్‌లో ఉదయం 10గంటల నుండి 5గంటల వరకు సర్టిఫికెట్లు పరిశీలన చేయడబునని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ సెట్లు, 3ఫోటోలతో హజరు కావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపవిద్యాధికారి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.