డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో స్పందన విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఇటీవల వెలువడిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించినట్లు జిల్లా కేంద్రంలోని స్పందన డిగ్రీ  కళాశాల  ప్రిన్సిపాల్ బాల్తు సైదారావు తెలిపారు.మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూజీ ఫోర్త్ సెమిస్టర్ బీటీజెడ్ సి  గ్రూపులో రాపర్తి శివాత్మిక గౌడ్ ,  ఎంపిసి గ్రూపులో ఎ.తేజస్విని , ఎం.మహేశ్వరి, ఎస్. మౌనిక , ఆర్.జాహ్నవి , ఎంసిసిఎస్ గ్రూపులో జీ.ఝాన్సీ , రేష్మ లు 10కి 10 ఎస్ జిపిఎలు సాధించారని చెప్పారు.యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఆ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ తీకుళ్ల  శ్రీనివాస రెడ్డి, కళాశాల డైరెక్టర్లు , అధ్యాపకులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.