డిజిటల్ అక్షరాస్యతలో విద్యార్థులు రాణించాలి.. డాక్టర్ పి పద్మవెల్లడి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంను కళాశాల ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి. రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .పోలారపు పద్మ మాట్లాడుతూ.. ప్రపంచంలో అక్షరాస్యతను సాధించిన దేశాలే మిగిలిన దేశాలపై అధిపత్యాన్ని చలాయించాలని, నేడు ప్రపంచమంతా కుగ్రామం మారుతున్న తరుణంలో ప్రతి విద్యార్థి కూడా డిజిటల్అక్షరాస్యతలో రాణించాలని నేటి పోటీ ప్రపంచంలో యువత రాణించాలంటే డిగ్రీ స్థాయిలోనే కంప్యూటర్ పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని కళాశాల విద్యార్థులకు కావాల్సిన కంప్యూటర్ ల్యాబ్స్ టిఎస్ కే సి ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమం నిర్వాహకులు టి.రాజు, వైస్ ప్రిన్సిపల్ బిందు శ్రీ , ఐక్యూయేసి కోఆర్డినేటర్ కె. కిరణ్ కుమార్, అకడమిక్ కోఆర్డినేటర్ జి.శేఖర్, బి. చెంచురత్నయ్య, ఎస్. ఇంద్రాణి, బి. సరిత ,ఎస్. ఈశ్వర్ ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు