డిప్యూటీ సివిల్ సర్జన్ గా పదోన్నతి పొందిన డాక్టర్ శరత్ చంద్రకు ఘనంగా సన్మానం. మహాత్మ జ్యోతిబాపూలే వైస్ చైర్మన్ ఇందూర్ కుర్వ బాలు.
ప్రభుత్వ మాతా శిశు జిల్లా ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా డాక్టర్ శరత్ చంద్రపదోన్నతి పొందిన సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే వైస్ చైర్మన్ ఇందూర్ కుర్వ బాలు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. గురువారం.
మహాత్మ జ్యోతిబాపూలే వైస్ చైర్మన్ ఇందూర్ కుర్వ బాలు ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ అధినేత డాక్టర్ శరత్ చంద్రను తోటి మిత్రులతో కలిశారు.ప్రభుత్వ మాతా శిశు జిల్లా ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా పదోన్నతి పొందిన మా ఆత్మీయులు డాక్టర్ శరత్ చంద్ర కుమార్ హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చెంగోలి ఎం.పి.టి.సి రాము, వికారాబాద్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి జగదీష్, ప్రగతి కోచింగ్ సెంటర్ శ్రీశైలం , మంబపుర్ రాజు, జనగాం విష్ణు మరియు తోటి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.