డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు తెలంగాణ సెగ
మెదక్: డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు జోగిపేటలో తెలంగాణ సెగ తగిలింది. డిప్యూటీ సీఎం కాన్యాయ్ ఆందోల్ వైపు వెళ్తుండగా జోగిపేటలో ‘ తెలంగాణ దీక్షా దివాస్ ‘ శిబిరంలో కూర్చునున్న తెలంగాణ కార్యకర్తలు జైతెలంగాణ నినాదాలు చేస్తూ కాన్యాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు హడావిడి చేస్తూ తెలంగాణ వాదులను తోసివేశారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణవాదులు శిబిరంలోని కుర్చీలను డీప్యూటీ సీఎం కాన్వాయ్‌పైకి విసిరారు.