డివిజనల్‌ అటవి అధికారి అందించిన విరాళం అభినందనీయం : కలెక్టర్‌

కరీంనగర్‌, జనవరి 31 (): హృదయ స్పందన కార్యక్రమానికి డివిజనల్‌ అటవి అధికారి (పశ్చిమ) శాఖ సిబ్బంది రూ.84,373 విరాళం అందించడం అభినందనీయమని కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. రూ. 84,373లు చెక్కును శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌కు పారెస్టు ఆఫీసర్‌ డి.నరేందర్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 12 సంవత్సరాల లోపు నిరుపేద కుటుంబాల చిన్నారులకు ఖరీదుతో కూడిన గుండె సంబంధ శస్త్ర చిక్సితలు నిర్వహించి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి హృదయ స్పందన కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని కలెక్టర్‌ అన్నారు. అటవీ శాఖ సిబ్బంది స్ఫూర్తితో ఇతర శాఖల అధికారులు సిబ్బంది హృదయ స్పందనకు విరాళం ఇచ్చుటకు ముందుకు రావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.