డిసెంబర్‌లో జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం

– ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

అనంతపురం, నవంబర్‌22(జ‌నంసాక్షి) : దేశంలో ఎక్కడా లేనివిధంగా పాత్రికేయులకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ స్కీమ్‌ పై సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ అధికారులతో మంత్రి కాలవ శ్రీనివాసులు గురువారం అనంతపురం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ స్కీమ్‌ పై సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, పగడ్బందీగా అమలు చేయాలన్నారు. డిసెంబర్‌ నెలలో జర్నలిస్ట్‌ ల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పథకం కింద గ్రావిూణ విలేఖరులకు 5 వేల ఇళ్లు ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. జర్నలిస్ట్‌ ల ఇళ్ల నిర్మాణం అనేది నిరంతర పక్రియ అని, స్థలాలు ఉండి ఇళ్ళు కట్టుకోలేని జర్నలిస్టులకు ఇళ్ళు మంజూరు చేస్తామన్నారు. కవిూషనర్‌ వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. లబ్ధిదారుల నుండి ధరఖాస్తులు తీసుకోవడానికి డీపీఆర్వో కార్యాలయాల్లో నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయాలని, జిల్లా పౌరసంబంధాల అధికారులు జర్నలిస్ట్‌లు అందించిన ధరఖాస్తులను తీసుకున్న తర్వాత సమాచార శాఖ అధికారులు ఆన్‌లైన్‌ చేయాలని తెలిపారు.