డిసెంబర్‌ నుంచి డ్రోన్లు చట్టబద్ధం

– అమల్లోకి కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ, ఆగస్టు28(జ‌నం సాక్షి) : భారత్‌లో డ్రోన్లను ఇక వాణిజ్య అవసరాల కోసం వినియోగించొచ్చు. వ్యవసాయం, ఆరోగ్యం, విపత్తు సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగాన్ని చట్టబద్ధం చేస్తూ తీసుకొచ్చిన నిబంధనలు డిసెంబర్‌ 1నుంచి అమలులోకి రానున్నాయి. అయితే పేలుడు పదార్థాలు, ఆహార పదార్థాల రవాణాకు డ్రోన్ల వినియోగాన్ని మాత్రం ప్రభుత్వం నిషేధించింది. ఇందుకు సంబంధించిన విధివిధాలను పౌరవిమానయాన శాఖ విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారం పౌర డ్రోన్‌ కార్యకలాపాలను ఉదయం పూట వెలుతురు ఉన్న సమయంలోనే నిర్వహించాలి. ఆకాశంలో 450 విూటర్ల ఎత్తులోపే అవి ఎగరాలి. కేంద్ర నిఘా సంస్థ, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థకు చెందిన నానో డ్రోన్లు మినహా.. అన్ని డ్రోన్లకు రిజిస్టేష్రన్‌ తప్పనిసరి. వీటికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను(యూఐఎన్‌) ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి డీజీసీఏ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. అలాగే డ్రోన్లు విమానాశ్రయాలు, అంతర్జాతీయ సరిహద్దులు, తీర ప్రాంతలు, రాష్ట్ర సచివాలయాలు, వ్యూహాత్మక ప్రాంతాలు, మిలటరీ ప్రదేశాలు, ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌ సవిూపంలో ఎగరకుండా ఈ నిబంధనల్లో నిషేధాలు జారీ చేశారు. వివాహ మ¬త్సవాల్లో రాత్రి సమయంలో కూడా డ్రోన్లను వినియోగించుకోవచ్చు. 50 అడుగుల కంటే తక్కువ ఎత్తులో తిరిగే, 250 గ్రాముల కంటే తక్కువ బరువు ఉండే నానో డ్రోన్లకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. అయితే 200 అడుగుల ఎత్తు వరకూ ఎగిరే మైక్రోడ్రోన్లు, 450 అడుగుల ఎత్తు వరకూ ఎగిరే చిన్న డ్రోన్లకు మాత్రం స్థానిక పోలీసుల నుంచి అనుమతి తప్పని సరి. తమ నిబంధనలు భారత్‌లో డ్రోన్ల తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకంగా ఉంటాయని పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు వెల్లడించారు. డ్రోన్ల మార్కెట్‌ భవిష్యత్‌లో 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రోన్ల ద్వారా ఫుడ్‌ ఐటమ్‌ డెలివరీ గురించి పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా మాట్లాడుతూ.. ఫలితాలను బట్టి రెండో దశ నిబంధనల్లో వాటిని చేర్చే అవకాశముందని చెప్పారు.