డిసెంబర్‌ 12 నుంచి బాబు పాదయాత్ర

కరీంనగర్‌,నవంబర్‌21: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర డిసెంబర్‌ 12న కరీంనగర్‌ జిల్లాలో అడుగు పెట్టనున్నది. ఆదిలాబాద్‌ నుంచి యాత్ర కరీంనగర్‌లో ప్రవేశిస్తుంది.  9 రోజులపాటు- 152 కిలోవిూటర్ల మేరకు పాదయాత్ర జరిగేలా జిల్లా టిడిపి నేతలు రూట్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు రూట్‌సర్వే చేశారు. ఆదిలాబాద్‌లో ఐదున యాత్ర ప్రారంభమై వారం రోజులపాటు కొనసాగుతుంది.అదిలాబాద్‌ జిల్లా విూదుగా బాదనకుర్తి ద్వారా మల్లాపూర్‌ మండలం దామరాజ్‌పల్లి నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం కానున్నది. అక్కడ నుంచి ఒగులాపురం, సం గెం, తాటిపల్లి, రేగుంట, ఇటిక్యాల, రా యికల్‌ మండలం కిష్టంపేట విూదుగా జగిత్యాల పట్టణం నుంచి మల్యాల మండలం నుంచి గంగాధర, రామడు గు, చొప్పదండి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్‌, ఓదెల మండలాల విూ దుగా జమ్మికుంట నుంచి నగరం గ్రా మం విూదుగా వరంగల్‌ జిల్లాలో ప్రవేశించనున్నది. రెండు రోజుల తర్వాత  రూట్‌మ్యాప్‌కు తుదిరూపం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 9 రోజుల పాటు- జరగనున్న చంద్రబాబు పాదయాత్ర ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల విూదుగా సాగుతుంది. కోరుట్లలో ఒక రోజు, జగిత్యాలలో ఒక రోజు, చొప్పదండిలో మూడు రోజులు, పెద్దపల్లిలో మూడు రోజులు, హుజురాబాద్‌ ని యోజకవర్గంలో ఒకరోజు చొప్పున పాదయాత్ర సాగనున్నదని మాజీమంత్రి ఎమ్మెల్యే ఎల్‌. రమణ తెలిపారు.  తొలుత ప్రతిపాదించిన రూట్‌లో కరీంనగర్‌ అసెంబ్లీని మినహాయించారు.