డి డి ఎస్ బల్వాడి భూములు అమ్మే హక్కు ఎవరు ఇచ్చారు

పేదల భూములు పేదలకు దక్కలి

డి డి ఎస్ వ్యవస్థాపకుడు కె ఎస్ గోపాల్

జహీరాబాద్ సెప్టెంబర్ 1 (జనం సాక్షి) :డెక్కన్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఉద్దేశ్యం తో బల్వాడి కోసం భూములను దాత ల సహాయం తో తీసుకున్నారు అని డి డి ఎస్ వ్యవస్థాపకుడు డైరెక్టర్ కె ఎస్ గోపాల్ అన్నారు. శుక్రవారం మహిళ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి డి ఎస్ సంస్థ అనేది మహిళలు అభివృద్ధి చెందాలని ఏర్పాటు చేసిన సంస్థ డి డి ఎస్ అన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో బల్వా డి భూములను మహిళ సంఘాల ప్రతినిధులకు సమాచారం లేకుండానే భూములను అమ్మి డైరెక్టర్ సతీష్ ఆరోగ్యం కోసం ఒక కోటిన్నర రూపాయలు ఖర్చు చేశాం అని లెక్కలు చూపెడుతున్నారు అని ఆయన వాపోయారు.డి డి ఎస్ లో డైరెక్టర్ లకు సమాచారం ఉండకుండానే సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.30 సంవత్సరాలు అయిన సంస్థ అప్పటి నుండి ఇప్పటి వరకు జనారల్ బాడీ నిర్వహించలేదన్నారు. పేదల భూములు అమ్మిన వారి పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. పిడీ ఎస్ కు సంబంధించిన డబ్బులు మహిళల సంఘాల కు చెందలి కానీ అవి నేరుగా సంస్థ ఖాతాలో కి మార్చారు అన్నారు. దింతో మహిళల లకు ఆ డబ్బుల పై అధికారం లేకుండా ఉందన్నారు. ఈ సమావేశంలో 15 గ్రామాల్లో నుండి మహిళ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

తాజావార్తలు