డీఈ మృతదేహం లభ్యం

కరీంనగర్‌ : నిన్న అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఎస్పీ డీఈ విజయ్‌కుమార్‌ మృతదేహం బీబీఎం కాలువలో లభ్యమైంది. హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లోని ఎన్‌ఆర్‌ఎన్‌పీ బీబీఎం కాల్వలో ఈ ఉదయం ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు మృతదేహాన్ని నిన్న అదృశ్యమైన డీఈదిగా గుర్తించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హుజూరాబాద్‌ పోలీసులు తెలిపారు. తాడిగల్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని శంకరాపట్నం- సైదాపూర్‌ మండలాల శివారులోని ఎస్కేవ్‌ వద్ద విజయ్‌కుమార్‌ శనివారం రాత్రి విధులు నిర్వాహించి సిబ్బందితో కలిసి జీపులో నిద్రపోయాడు. ఉదయం లేచిచూసేసరికి అధికారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సిబ్బంది పోలీసులక సమాచారమందించారు.