డెంగ్యూతో బిటెక్‌ విద్యార్థిని మృతి

విజయవాడ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మాచీనెనిపాలెంలో మంగళవారం విషాదం నెలకొంది. అమృత సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ ్గ/నైల్‌ ఇయర్‌ చదువుతున్న బల్లా రజిత అనే విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. గత నాలుగు రోజులుగా రజిత డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. గత రాత్రి 7 గంటల సమయంలో తీవ్ర జ్వరంతో రజిత మృతి చెందింది. రజిత తల్లిదండ్రులు, కళాశాల స్నేహితులు శోకసంద్రంలో మునిగారు.

తాజావార్తలు