డైలీ వేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి-పి వై ఎల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల

భానుచందర్
టేకులపల్లి, నవంబర్ 16( జనం సాక్షి ): గత 19 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఐ టి డి ఏ పరిదిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ లో పని చేస్తున్నా ఉద్యోగులు గత 30 సంవత్సరాలుగా హాస్టల్, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వారిని రెగ్యులర్ చేయలేదని, కనీసం వారికి సరియైన సమయంలో జీతాలు కూడా ఇవ్వడం లేదని ప్రగతిశీల యువజన సంఘం (PYL) కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలో ఉన్న ఆశ్రమ పాఠశాలల వద్ద చేస్తున్నా దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన వారికి మద్దతు దీక్ష శిబిరం లో కూర్చొని వారు చేస్తున్న సమ్మె కు మద్దతు గా ఉంటామని హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ హాస్టళ్ల, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన డైలీ వేజ్ వర్కర్లు అందరినీ క్రమబద్ధీకరించలని ఆయన అన్నారు. అదే విధంగా వీటీ తో పాటు కొన్ని సంక్షేమ హాస్టళ్ల లో పని చేస్తున్నా ఔట్సోర్సింగ్ వర్కర్స్ కు రెండు సంవత్సరాలుగా జీతాలు రాలేదని వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా సమ్మె చేస్తున్న ఆశ్రమ పాఠశాలలో రోజుకి పది మంది పిల్లలుతో వంట చేయించడం సరియైనది కాదని, వర్కర్లకు న్యాయం చేయలేక పిల్లలతో వంటలు చేయించడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ, వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ధారవత్ వెంకట్రాం, CH. ధనలక్ష్మీ, P. బాలమ్మ, జొగ. సీతారాములు, D. శ్రీను, G. నాగులు, ధనసరి. ఎర్రమ్మ నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు