డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తాం
–డోర్నకల్ పట్టణంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్
డోర్నకల్,ఆగస్టు 23, జనం సాక్షి న్యూస్ :
డోర్నకల్ ను అభివృద్ధి చేసి చూపెడతామని డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. బుధవారం డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలోని అన్ని వార్డులలో ఎమ్మెల్యే రెడ్యా పర్యటించి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రతి వార్డులలో డిజె సప్పట్లో ఆటపాటలు, కోలాటాలు, బతుకమ్మలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.గ్రామాలలో ప్రతి వాడ వాడకు తిరిగి ప్రజల బాగోగులను తెలుసుకున్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని మంచినీటి, విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశాలలో శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ మున్సిపాలిటీలోని 25 కోట్లతోటి త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, మూడో వార్డు ట్రంకు తండాలోని మంచినీటి సమస్య కోసం రెండు బోర్లను వేస్తామని ఎమ్మెల్యే రెడ్యా అన్నారు. మున్సిపాలిటీలో ప్రతి వార్డులో సుమారు 56 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేస్తామని, పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పట్టణ ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి ఏలాంటి ఆ సౌకర్యం లేకుండా చూసుకోవాలని రెడ్యా నాయక్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు మున్సిపాలిటీ , 3,146 గ్రామపంచాయతీ ఏర్పడ్డాయని, అందులోనూ 79 గ్రామపంచాయతీలు గిరిజన తండాలే ఉన్నాయని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయని ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుల రుణమాఫీ, కెసిఆర్ కిట్టు, గతంలో ఎన్నడు లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇంకా చాలా ఉన్నాయ ఎమ్మెల్యే రెడ్యా అన్నారు. నియోజవర్గ ప్రజలు మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి మరిన్ని అభివృద్ధికి పాటుపడాలని, ప్రజా సంక్షేమే ప్రభుత్వ దేహమని ఆయన ఉన్నారు.త్వరలో గృహలక్ష్మి పథకం కింద డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని,నియోజవర్గంలో వెయ్యి మందికి బీసీ బందు, దళిత బంధు ఇస్తామని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నున్న రమణ,ఎంపీపీ బాలు నాయక్, జడ్పిటిసి కమలారామనాథం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, మున్సిపాలిటీ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం,మాజీ జెడ్పిటిసి సత్తిరెడ్డి,ముఖ్య నాయకులు, వార్డు కౌన్సిలర్లు పోటు జనార్ధన్, అశోక్,శరత్, కొత్త రాధిక వీరన్న, వీరన్న, పర్వీన్ సుల్తానా సలీం, మధు అరుణ, సంధ్యా రమేష్, కాల మౌనిక యశోధర్ జైన్, సురేందర్ జైన్, బోడ అమల హరిలాల్, కొండేటి హేమచంద్రశేఖర్, భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు ఏపూరి వెంకటేశ్వర్లు, పట్టణ యూత్ అధ్యక్షుడు వెంకటేష్, టౌన్ కార్యదర్శి కొత్త రాంబాబు,రాయల వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచులు భానోత్ పాండు నాయక్, గుగులోత్ శ్రీను, రాంబాయి శంకర్, ఎంపీడీవో అపర్ణ, తాసిల్దార్ నాగ భవాని, మున్సిపల్ కమిషనర్, ఎంపీఓ మున్వర్ బేగ్,ఏపీఎం శంకర్, విద్యుత్ శాఖ ఏఈ కోటే కిరణ్, మహిళా అధ్యక్షురాలు హైమావతి, వెంకటమ్మ, మున్సిపాలిటీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.