డ్రం సీడర్ తో వరి అధిక దిగుబడి   

                తూప్రాన్ (జనం సాక్షి )జూన్ 23 :: డ్రం సీడర్ ద్వారా వరి అధిక దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారి సంతోష్ పేర్కొన్నారు మండలంలోని ఇమాంపూర్ గ్రామంలో  రైతులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు ఈ సదస్సులో వారికి  వరిలో  దమ్ము చేయకుండా  నేరుగా విత్తి  వరి సాగు, డ్రం సీడర్ తో వరి విత్తు పద్ధతి, భూమిలో ఉన్న  బాస్వరపు  ఎరువును  కరిగించే ఎరువు  ను ఉపయోగించే విధానం, పత్తి సాగులో యాజమాన్య పద్దతుల గురించి ఆయన వివరించారు . ఇమాంపూర్ గ్రామంలో 5  రైతులు  వరిలో  దమ్ము చేయకుండా నేరుగా విత్తి  వరి సాగు  చేయడానికి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంల ఏ ఈ ఓ సంతోష్ , సర్పంచ్   ఏల్లం,  రైతుబంధు సమితి  కోఆర్డినేటర్  ఎల్లయ్య, రైతులు పాల్గొన్నారు.