డ్రాప్ బాక్స్ ను వినియోగించాలి
జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే సందర్శకులు బడి పిల్లల సహాయార్ధం ఏవైనా స్టేషనరీ వస్తువులు ఇవ్వదల్చుకున్న వారు కలెక్టరేట్ కార్యలయం లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో ఉంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వీరు అందించిన పుస్తకాలు, పెన్స్, బ్యాగ్స్, పెన్సిల్స్,గ్రంధాలయ పుస్తకాలు, ఇతర ఏ స్టేషనరీ వస్తువు అయిన ప్రభుత్వ పాఠశాలలో అవసరమున్న విధ్యార్ధులకు అందజేయడం జరుగుతుందని దీని వల్ల ఆ విధ్యార్ధి చదువుకోవడానికి మీరు సహాయం చేసిన వారు అవుతారని ఇది చాలా గొప్ప విషయమని , దీని పై ప్రతి ఒక్కరూ దృష్టి ఉంచాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవిన్ కుమార్, జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి , జిల్లా ఉద్యాన శాఖ అధికారి అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.