డ్రిప్‌ వాడకంతో నీటి ఆదా

అనంతపురం,జూలై28(జ‌నం సాక్షి): అనంతపురం జిలా పెనుకొండ పట్టణంలో సూక్ష్మ సాగునీటి పథకం వారి ఆధ్వర్యంలో రైతులకు డ్రిప్‌ నీటి పారుదలపై అవగాహన కల్పించారు. తక్కువనీటితో డ్రిప్‌ ద్వారా పంటలు పండించుకోవడం సులభమని తెలిపారు. స్థానిక భువన విజయ సమావేశ భవనంలో సదస్సును శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బికె.పార్థసారధి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎపిఎంఐపి పిడి.వెంకటేశ్వరులు మాట్లాడుతూ.. డ్రిప్‌ వాడకం ,పరికరాల నిర్వహణ గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అశ్వర్థ నారాయణ, జెడ్పీటిసి నారాయణస్వామి, మండల కన్వీనర్‌ శ్రీరాములు, ఎంపిపి యశోద కేశవయ్య , వైస్‌ ఎంపిపి సిద్ధయ్య , సింగిల్‌ విండో అధ్యక్షులు భాస్కర్‌ రెడ్డి, నాయకులు తివేంద్ర, లక్ష్మి నారాయణరెడ్డి, రాధాక్రిష్ణ, చిచ్చాతోపాటు ఎపిఎంఐపి అధికారులు, ఉద్యాన అధికారులు , నియోజక వర్గంలోని రైతులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు