డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను పరిష్కరించండి..గ్రామసభలో సభ్యుల చర్చ

పానుగల్ నవంబర్ 05 జనంసాక్షి

డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామసభలో సభ్యులు చర్చించినట్లు సర్పంచ్ జయరాములు సాగర్ తెలిపారు.
మహ్మదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాబోయే 2023-2024 సంవత్సరానికి లేబర్ బడ్జెట్ మరియు పనుల ఆమోదం కొరకు గ్రామ సభ నిర్వహించారు.వంద రోజుల పనుల్లో భాగంగా కూలీలకు కల్పించాల్సిన పనుల గురించి చర్చించడం జరిగింది. గ్రామంలోని 5వ వార్డులో నెలకొన్న ముఖ్యంగా డ్రైనేజీ, సీసీ రోడ్డు సమస్యలపై స్థానిక వార్డు మెంబర్ శ్యామ్ సుందర్ గౌడ్ సర్పంచ్ దృష్టికి తీసుకురాగా, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ జయరాములు సాగర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ అక్షయ్,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి టీఏ చంద్రశేఖర్,వార్డు సభ్యులు శ్యామ్ సుందర్ గౌడ్ ,మిద్దె నరసింహ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.