ఢిల్లీ పర్యటన వాయిదా : కోదండరాం

హైదరాబాద్‌: యూపీఏ నేతలు అందుబాటులో లేనందున ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుంటున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలియజేశారు. ఈ నెల 27న బహిరంగసభకు బదులుగా దీక్ష చేయాలి ని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. దీక్ష కార్యక్రమాల విధివిధానాలను ఆదివారం చర్చిస్తామన్నారు. ఈ నెల 18న కాంగ్రెస్‌ మేథోమథన సదస్సు ఉన్నందున 17న నిరసన చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.