ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కానున్నా షిండే
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నా నేపథ్యంలో కేంద్రం కఠిక చర్యలు తీసుకునేందుకు సిద్థం అవుతోంది. హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ ఈ ఘటనలో పోలీసులు తీసుకున్న చర్యలపై సమీక్షించనున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈ శుక్రవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులు లా అండ్ ఆర్డర్ ఢిల్లీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలన్న దానిపై ఈ సమావేశంలో రాజకీయ ఏకాభిప్రాయాన్ని ఆమె కోరనున్నారు. ఘటనపై ఢిల్లీలోని మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సాయంత్రం 6 గంటలకు వారితో అయి చర్చించనున్నట్లు చెప్పారు.