Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > మెదక్ > Main > ఢిల్లీ వసంత్ ఆలోచనలు నిత్యనూతనం: జేడీ లక్ష్మీనారాయణ / Posted on June 2, 2022
ఢిల్లీ వసంత్ ఆలోచనలు నిత్యనూతనం: జేడీ లక్ష్మీనారాయణ
జహీరాబాద్ జూన్ 2 (జనంసాక్షి)ఢిల్లీ వసంత్ ఆలోచనలు నిత్యనూతన మని అది పాదయాత్ర అయినా కుంభ సందేశ యాత్ర అయినా ఆయన ఆలోచనలకు తార్కాణమని .సిబిఐ మాజీ జేడీ వి. వి లక్ష్మీనారాయణ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని బసవ మంటపంలో గురువారం ఢిల్లీ వసంత్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి సిబిఐ మాజీ జేడీ వి. వి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ సర్వతోముఖాభివృద్ధికి కి ఢిల్లీ వసంత్ చేసిన ఈ వినూత్న ప్రయత్నం, చరిత్రలోనే నిలిచిపోయిందని అన్నారు. సువర్ణ అక్షరాలతో బంగారు పలకపై మేనిఫెస్టోను విడుదల చేయడం ఎంతో నిబద్ధత కూడిన విషయమని కొనియాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు జహీరాబాద్ ను బంగారు జహీరాబాద్ గా మార్చేలా ఉన్నాయని అందుకు నేను ముఖ్య అతిథిగా రావడం గర్వంగా భావిస్తున్నాన్నారు,ఢిల్లీ వసంత్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి జెడి రావడం మన అభివృద్ధికి ఎంతో సహకరిస్తుందని దేశములోని ఆదర్శ గ్రామాల పనితీరుపై పి హెచ్ డి డాక్టరేట్ విద్యార్థిగా జెడి అనుభవాలు మనకు ఉపయోగపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ముసాయిదా పత్రంలో పేర్కొన్న మేనిఫెస్టో అంశాల్లో కోపరేటివ్ రంగం స్టార్టప్ల ప్రోత్సాహం కమ్యూనిటీ కరెన్సీగా ల్యాండ్ బ్యాంకు అంశాలు చాలా విప్లవాత్మకమైనదని తెలిపారు. సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీ, అల్లం ఫ్యాక్టరీ లే కాకుండా హౌసింగ్ హౌసింగ్ సొసైటీ, ఆర్థిక సొసైటీ, విద్యాసంస్థలు మెడికల్ సంస్థలు నెలకొల్పే అవకాశం ఉందని చెప్పారు. జహీరాబాద్ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా పార్టీలకతీతంగా ప్రజలు సహకార రంగం కోసం తమ వంతు షేర్లు ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. త్వరలో లో ఒక్క అంశానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో సద్భావన మంచ్ నాయకులు జబ్బార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జనార్ధన్, లింగాయాత్ సమాజ్, నాయకులు డాక్టర్ శరణప్పలు, తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు, సహకార రంగం అభివృద్ధికై తమ వంతు వాటా గా కొంతమంది షేర్లు ప్రకటిస్తూ మొహమ్మద్ జబ్బార్ డాక్టర్ డాక్టర్ శరణప్ప బాలరాజ్ మహమ్మద్ షకీల్ సంతోష్ విశ్వనాధ్ గార్లు ముందుకు వచ్చారు, ఈ కార్యక్రమానికి సంగప్ప పాటిల్, చంద్రశేఖర్ పాటిల్, యంపిజే నాయకులు యం. డి. అయూబ్, జబ్బార్, రైతు సంఘం నాయకులు వెంకటరెడ్డి, నారాయణ రెడ్డి, ఢిల్లీ వసంత్ బృందం సభ్యులు డిక్కీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇంఛార్జి జనార్దన్, బహుజన వక్త మక్సూద్, జాన్సన్, సల్మాన్, వేణు, సుభాష్, ముదుగుండ్లా శ్రీను, స్టీవెన్ సన్, తదితరులు పాల్గొన్నారు.