ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ఢిల్లీ : ఈరోజు ఢిల్లీ హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులు సైతం అత్యాచార బాధితురాలికి తక్షణ చికిత్స అందించే విధంగా, మెడికో లీగల్‌ కేసు నెపంతో నిరాకరించడం కుదరదని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి, వైద్యశాఖకు సూచించింది. ఇది అమలయ్యేలా చూడాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసు కమిషన్‌ర్‌లకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదాలు, అత్యాచారం లాంటి ఘటనల్లో బాధితులను దగ్గరిలోని ఆస్పత్రికే తీసుకెళ్లాలని, ఏ ఆస్పత్రి అన్న చర్చ చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది.