తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 25 : అఖిల భారత బంజార సేవా సంఘం జిల్లా సమావేశం ఈ నెల 29న ఆదిలాబాద్‌లోని శ్రీసేవాదాస్‌ విద్యా మందిర్‌ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శివలాల్‌నాయక్‌ తెలిపారు. బంజారాల ఐక్యతను కాపాడుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. గిరిజనులతోపాటు సమానంగా మైదాన ప్రాంత గిరిజనులకు విద్యా, వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బంజార తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా మాజీ మంత్రి అమర్‌సింగ్‌తిలావత్‌ హాజరు అవుతున్నారని జిల్లాలోని బంజారాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

తాజావార్తలు