తండ్రి సన్నిహితులను దగ్గరకు తీసే యత్నాలు
మారుతున్న జగన్ వ్యూహాలు?
అమరావతి,సెప్టెంబర్5(జనం సాక్షి): జగన్ ఇంతకాలం ప్రత్యేక¬దాపై పోరాడినా ఎందుకనో పెద్దగా గుర్తింపు రాలేదు. పవన్ కళ్యాణ్ రాకతో మళ్లీ కదలిక వచ్చింది. దీంతో వైకాపా మళ్లీ కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు తన వైఖరితో దూరమైన తన తండ్రి ఆప్తమిత్రులకు జగన్ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ కిరణ్ చేరినా రాజకీయాలలో మాత్రం ఆయన చురుగ్గా పాల్గొనడంలేదు. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజకీయ పయనం ఎటువైపు అన్న దిశగా రాజకీయవర్గాల్లో చర్చసాగుతోంది. మరోవైపు తన తండ్రి బతికున్నప్పుడు ఆయనకు చేదోడుగా ఉన్న ఆయన కోటరీపై జగన్ దృష్టిపెట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే ఉండటంతో ఉండవల్లి అరుణ్‌కుమార్ సైతం తన రాజకీయభవిష్యత్తుకోసం బలమైన పార్టీవైపే మొగ్గుచూపుతారని సన్నిహితులు వ్యాఖ్యనిస్తున్నారు. తన తండ్రికి కీలక మిత్రులుగా వ్యవహరించిన వారిని దగ్గరచేసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శకూడా జగన్‌పై ఉంది. అందర్నీ కలుపుకొనిపోయే స్వభావాన్ని అలవర్చుకోవడం ద్వారా అధికార పార్టీని ఢీకొనాలని చూస్తున్నట్లు సమాచారం. రాజకీయాలలో శాశ్వతమిత్రలు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నది జగన్ ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఒకప్పుడు కుడి, ఎడమ భుజంగా, అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు మాత్రం జగన్‌కు దూరమయ్యారు. ఈ లోటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీపై పెద్ద ప్రభావమే చూపిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఒక్కరొక్కరుగా అందరినీదరిచేర్చుకుని చంద్రబాబుపై గట్టిగా పోరాడాలని, ప్రత్యేక¬దా ముందుకు తీసుకుని వెళ్లాలని సూస్తున్నారు. వై.ఎస్. సిఎంగా ఉన్న సమయంలో ఆయనకు పాలనపరంగా, ప్రతిపక్షాలపైఎదురుదాడిచేసే విషయంలో కొంతమంది ముఖ్యసన్నిహితులు ఉండేవారు. వారిలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తదితర మంత్రులు ఉండేవారు. వారు ఇప్పుడు జగన్ వెంటే ఉన్నారు. ఇకపోతే ప్రత్యేక¬దాపై పవన్ కళ్యాణ్ విమర్శలు ఇప్పుడు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. ప్రజల కోసం తాను ప్రధానిని సైతం నిలదీయటానికి వెనుకాడనని చెప్పారు. ప్రజల మనోభావాలు, ప్రతిపక్షాల ఆందోళనలతో ఒత్తిడికి లొంగిన చంద్రబాబు ఇపుడు ప్రత్యేక¬దా అంశం గురించి గట్టిగా మాట్లాడుతున్నారు.
—————————-