తక్షణం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సహనాన్ని పరిష్కరించకుండ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో  చేపట్టిన రీలేదీక్షలు గురువారంనాటికి 1026వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఐక్యంగా రాష్ట్రం కోసం ఉద్యమిస్తుంటే కేంద్రం మొండిగా వ్యవహరించడాన్ని వారు ఖండించారు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హ్చెచరించారు. రాష్ట్రం కోసం ప్రజలు తాడోపేడో తెల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వారు హెచ్చరించారు.