తక్షణం హైకోర్టును విభజించండి

మరోమారు కేంద్రమంత్రిని కోరిన సిఎం కెసిఆర్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తక్షణం హైకోర్టు విభజన చేపట్టాలని సిఎం కెసిర్‌ మరోమారు కేంద్రాన్ని కోరాఉ. ఇప్పటికే నాలుగేళ్ల సమయం గడిచిందని, ఇచ్చిన హావిూ మేరకు హైకోర్టును విభజించాలన్నారు.కొత్త జోనల్‌ విధానం సహా పలు పెండింగ్‌ అంశాలపై ప్రధాని సహా, కేంద్రమంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ చేరుకున్నారు. ఇందులో భాగంగా తొలుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీ వినోద్‌, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. సుమారు 50 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. నాలుగేళ్లు గడుస్తున్నా హైకోర్టు విభజన జరగకపోవడంపై కేంద్రమంత్రి తో సీఎం చర్చించినట్లు సమాచారం. హైకోర్టు విభజనకు సంబంధించి చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. కొత్తగా తీసుకొచ్చిన జోనల్‌ విధానంపైనా, గతంలో ముస్లిం రిజర్వేషన్ల అంశంపైనా న్యాయశాఖ మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన జోనల్‌ విధానంపై ప్రధాని మోదీతో శనివారం భేటీ కానున్నారు. రెండు మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్‌ దిల్లీలోనే ఉండనున్నారు.