తక్షణమే వీఆర్ఏల సమస్యలు పరిష్కరించి వారి జీవితాలు పెంచాలి మంగళ పెళ్లి హుస్సేన్
2020 డిసెంబర్ 9 అసెంబ్లీలో చేసిన ప్రకటనను అమలు చేయాలి
తొర్రూరు 20 జూలై (జనంసాక్షి ) డివిజన్ పరిధిలోని ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ మానవ హక్కుల న్యాయం సేవ సంఘం అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 2020 డిసెంబర్ 09 తారీకున అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది దాని ప్రకారము వారికి వేతనాలు పెంచాలని అన్నారు. ప్రతి ఉద్యోగి పనిచేస్తున్న తరుణంలో మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు, అదేవిధంగా 56సంవత్సరాలు దాటిన వారి తర్వాత వారసత్వ పరంగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని గతంలో చెప్పడం జరిగింది. అన్ని శాఖలకు న్యాయం చేస్తున్న తరుణంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏగా పనిచేస్తున్న సిబ్బందిపై చిన్నచూపు చూడడం మంచిది కాదు రాష్ట్ర ప్రభుత్వాము వెంటనే వారికి జీతాలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది. గతంలో వీఆర్వోలు రద్దు చేసిన తర్వాత వారి పని విధానంలో సడలింపు చేయడం జరిగింది. అయినప్పటికీ వారు ఎమ్మార్వో దగ్గర చేతి పనిగా వాడుకుంటున్నారు. కానీ అతి తక్కువ జీతాలతో వీఆర్ఏలుగా కొనసాగుతున్న వారిపై ప్రభుత్వం గుర్తించి న్యాయంచేయాలని కోరారు. త్వరలో వారి చేపడుతున్న దీక్షలలో హ్యూమన్ రైట్స్ నుంచి వారికి అండగా ఉంటామని తెలియజేశారు.