తగ్గిన హిల్లరి క్లింటన్ ఆధిక్యం
అమెరికా అధ్యక్ష బరిలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యం తగ్గిపోతోందని తాజా సర్వేలో తేలింది. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై ఆమె 4శాతం ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడైంది. ఇద్దరి మధ్య తొమ్మిది శాతం తేడా ఉందన్న అంచనాల నేపథ్యంలో.. ద ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా ఫలితాలను విడుదలచేసింది. దీని కోసం దేశ వ్యాప్తంగా ఈ నెల ఆగస్టు 9-16 మధ్య 2,010 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ‘ఈ రోజే ఎన్నికలు జరిగితే హిల్లరీపైపు మొగ్గుచూపుతామని 41 శాతం మంది వెల్లడించారు. ట్రంప్‌నకు మద్దతు పలుకుతామని 37 శాతం మంది వివరించారు’ అని ప్యూ వివరించింది. ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే క్లింటన్ ఫౌండేషన్ విదేశీ విరాళాలు స్వీకరించదని దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వెల్లడించారు. కేవలం అమెరికా పౌరులు, సంస్థల నుంచే నిధులు తీసుకుంటామని తెలిపారు.