తడికలపూడి గ్రామపంచాయతీలో కార్యదర్శి, గుమస్తాదే ఇష్టారాజ్యం
* ఏ పని కావాలన్నా చేతులు తడపాల్సిందే
* ప్రభుత్వ పథకానికి వేల రూపాయల లంచం
* అడిగితే బెదిరింపులు
* విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ఆదివాసి గిరిజనులుటేకులపల్లి, ఆగస్ట్ 26 (జనం సాక్షి ): ఆదివాసి అమాయక గిరిజనుల వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి, గుమస్తాల లంచావతారాలతో వేల రూపాయలు డబ్బులు దిగమింగుతూ చివరకు నెలలు, సంవత్సరాలు కావస్తున్న పనులు కాకపోవడంతో పైగా అడిగితే బెదిరించడాలతో విసుగు చెందిన అమాయకం ఆదివాసి గిరిజనులు డబ్బులు తీసుకొని పనిచేయకపోగా బెదిరింపులకు గురిచేస్తుండడంతో చివరకు విలేకరులను ఆశ్రయించి శనివారం ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి ఆవేదనను వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే టేకులపల్లి మండలంలోని తడికలపూడి గ్రామపంచాయతీ పరిధిలో గల పాత తడికలపూడి గ్రామానికి చెందిన వితంతువులు, వృద్ధులు పింఛన్ల కోసం, కొందరు మహిళలు కళ్యాణ లక్ష్మి కోసం రెండు సంవత్సరాలు నుండి, కొంతమంది నెలల క్రితం ఈ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో అన్ని పనులు చేసి పెడతామని వారి వద్ద కాగితాలు తీసుకుని పింఛన్ల మంజూరు కోసం మూడు వేల రూపాయలను, కల్యాణ లక్ష్మి మంజూరి కోసం 5000 రూపాయలను గుమస్తా ద్వారా పంచాయతీ సెక్రెటరీ డబ్బులు తీసుకున్నారని వారు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలంలోని ఇతర గ్రామపంచాయతీలలో కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కులు మంజూరు అవుతున్నప్పటికీ, తమకు రాకపోవడంతో, పెన్షన్ దారులను మభ్యపెడుతూ కాలం వెలబుచ్చడంతో అందరూ కలిసి గత కొద్ది నెలల నుండి పంచాయతీ కార్యదర్శి గుమస్తాలను నిలదీస్తుండటంతో వారు బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇచ్చిన డబ్బులు అడిగితే మీకు ప్రభుత్వ పథకాలు ఒక్కటి క