తనీఖీల్లో పట్టుకున్న వాహనాలపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు

హైదరాబాద్‌: నిబంధనలు   ఉల్లంఘిస్తూ  పట్టుబడిన వాహనాలపై  రవాణ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుకున్న వాహనాలపై  జరిమానా  విధించి సరిపెడుతోన్న అధికారులు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. తనఖీల్లో  పట్టుకున్న వాహనాలపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు  ప్రక్రియ మొదలు పెట్టారు. హైదరాబాద్‌, మెదక్‌, కృష్ణా జిల్లాల్లో పట్టుకున్న 35 వాహనాలపై కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆరు రోజుల  తనిఖీల్లో ఇప్పటివరకు పట్టుకున్న 411స్కూల్‌ బస్సులు,211ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు పట్టుకోగా నిబందనల ఉల్లంఘన తీవ్రతను బట్టి దశలవారీగా వాటిపై చార్జిషిట్‌లు నమోదు చెస్తామని అధికారులతు తెలిపారు.మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన నిరూపణ అయితే భారీ జరిమూనాతో పాటు తీవ్రత బట్టి సంబందిత వాహన పర్మిట్‌ రద్దు చేసే అవకాశాలున్నాయి.ట్రావెల్స్‌ కార్యాలయాలపై తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న రికార్డుల పరిశీలన త్వరగా పూర్తిచేసి పాటించని ట్రావెల్స్‌కు సోమవారం నోటిసులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.లోసాలు సరిదిద్దే వరకు తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.