ఏప్రిల్ 17వ తేదీ టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా వివాహం జరగబోతోంది. అయితే ఈ పెళ్లికి ధోనీని, సురేష్ రైనాను పిలిచేది లేదని జడేజా చెప్పాడట. అయితే ఇదేదో మనస్పర్థల కారణంగా చెప్పిన మాట కాదు. జడేజా ఓ బెంగాలీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదాగా ఇలా వ్యాఖ్యానించాడు. రైనా, ధోనీ తనకు ఆప్త మిత్రులని, వాళ్లను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని జడేజా చెప్పాడు. ధోనీ, రైనా తన పెళ్లికి తప్పకుండా వస్తారని జడేజా తెలిపాడు. జడేజాకు, మెకానికల్ ఇంజనీర్ రీవా సోలంకితో ఫిబ్రవరి మొదటి వారంలో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం సందర్భంగా జడేజాకు కాబోయే మావయ్య 95 లక్షల విలువైన ఆడీ క్యూ 7 కారును బహుమతిగా ఇచ్చాడు.