తప్పుదారి పట్టిస్తున్న వైకాపా

మండిపడ్డ టిడిపి ఎంపి రామ్మోమన్‌ నాయుడు

తొలుత పార్లమెంట్‌లో గందరగోళం

న్యూఢిల్లీ,జూలై18(జ‌నం సాక్షి): కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేక వైకాపా నేత విజయసాయిరెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని టిడిపి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. విభజన హావిూల అమలు కోసం పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధించేందుకు తెదేపా ఎంపీలు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతుంటే దీనిని సహించలేక విజయసాయిరెడ్డి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంతో పోరాటానికి కలిసి రాకుండా ఒంటెద్దు పోకడలు అవలంభిస్తున్న వైకాపాకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. మరోవైపు బుదవారం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభంకాగానే వివిధ పక్షాలకు చెందిన సభ్యులు సభలో నిరసనకు దిగారు. వాయిదా తీర్మానాల కోసం సభ్యులు పట్టుబట్టారు. అయితే స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీకి జరిగిన అన్యాయంపై తెదేపా ఎంపీలు పార్లమెంట్‌ బయట, లోపల ఆందోళన కొనసాగించారు. సమావేశాలకు ముందు పార్లమెంట్‌ ఆవరణలో ప్లకార్డులు చేతబట్టి నేతలు ఆందోళనకు దిగారు. లోక్‌సభ ప్రారంభంకాగానే అవిశ్వాస తీర్మానంపై చర్చకు తెదేపా సభ్యులు పట్టుబట్టారు. ఏపీకి ప్రత్యేక ¬దా కోరుతూ సభలో నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. విభజన హావిూలను నెరవేర్చాలని కోరారు. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ప్రశ్నోత్తరాల తర్వాత ఆయా అంశాలపై చర్చిద్దామని స్పీకర్‌ వారికి సర్దిచెప్పారు. అయితే సభ్యులు నిరసనలను ఆపకపోవడంతో సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.

టు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం ఏపీకి జరిగిన అన్యాయంపై తెదేపా సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక ¬దా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభను ఛైర్మన్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

—-