తలకిందులుగా తపస్సు చేసినా.. 

ఏపీలో బీజేపీకి కష్టమే
– బీజేపీకి ఓటు వేస్తే ఆర్‌ఎస్‌ఎస్‌కు వేసినట్లే
– ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి
అనంతపురం, ఆగస్టు31(జ‌నం సాక్షి) : ఆర్‌ఎస్‌ఎస్‌ తలకిందులగా తపస్సు చేసినా ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు రాలవని పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. మంత్రాలయంలో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమావేశాలపై రఘువీరా సెటైర్లు వేశారు. అనంతపురంలో శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాలుగా మతఛాందస్తులు దేశాన్ని పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. ఆంధప్రదేశ్‌లో బీజేపీకి అడ్రస్‌ లేదన్నారు. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌, మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఉత్సవాలను అపవిత్రం చేయటం తగదన్న పీసీసీ చీఫ్‌… బీజేపీకి ఓటు వేస్తే అది ఆర్‌ఎస్‌ఎస్‌ కి వేసినట్టే అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసింది నోట్ల రద్దు కాదని, సామాన్యుడి జీవితాలు రద్దు చేశారంటూ రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మతాల మధ్య చిచ్చుపెడుతూ బీజేపీ పబ్బం గడుపుకోవాలనిచూస్తుందన్నారు. రాఫెల్‌ కుంభకోణంలో నిజానిజాలు చెప్పేందుకు కేంద్రం భయపడుతుందని, అది రాహస్యమంటూ తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాఫెల్‌ కుంభకోణంలో వేలకోట్లు దోపిడీ జరిగిందని రఘువీరా ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు, కేంద్రం కలిసి ఏపీ ప్రజలను నిలువునా ముంచారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి ప్రత్యేక ¬దా ఇస్తామని ఇప్పటికే రాహుల్‌ ప్రకటించారని, ఏపీలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటుందన్నారు. బీజేపీ వచే/-చ ఎన్నికలో/-ల తగిన గుణపాఠం తప్పదని రాఘువీరా పేర్కొన్నారు.
—————————

తాజావార్తలు