తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం
గరిడేపల్లి, ఆగస్టు 6 (జనం సాక్షి):
తల్లిపాల తోనే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ప్రతి తల్లి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలను మాత్రమే బిడ్డకు ఆహారంగా ఇవ్వాలని సర్వారం సర్పంచ్ కర్నాటి నాగిరెడ్డి అన్నారు. శనివారం గరిడేపల్లి మండలంలోని సర్వారం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సర్పంచ్ కర్నాటి నాగిరెడ్డి, అంగన్వాడీ టీచర్ ఆత్కూరి వంశీప్రియులు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపునే ప్రతి తల్లి తన బిడ్డకు ముర్రుపాలు త్రాగించాలని అట్లా త్రాగించడం వలన పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాక సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తల్లిపాలకు మించిన దివ్య ఔషదం మరొకటి లేదని అన్నారు. తల్లిపాల విశిష్టత గురించి గర్భిణీ బాలింత లకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా బరిగేల లలిత, ఆశా వర్కర్ జ్యోతి, పగిడి గోవర్ధన, లక్ష్మి, సుమలత, ఉమ, గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు.