తహసిల్దార్ కార్యాలయం నిర్బంధం చేసిన వీఆర్ఏలు
కొత్తగూడ అక్టోబర్ 10 జనం సాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని 78 వ నిరవేదిక సమ్మెలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం నిర్బంధం చేసిన వీఆర్ఏలు.వీఆర్ఏల మండల అధ్యక్షుడు చెన్నూరు రవి మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీలు విఆర్ఏలకు పే స్కేలు ఇస్తానని,అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తానని,55 సం.రాలు నిండిన వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని గత 2017 సం.రం ప్రగతిభవన్లో ఇచ్చిన హామీ నుండి మార్చి అసెంబ్లీ 2022 వరకు అసెంబ్లీలో ఇచ్చిన హామీలనే మరలా మరలా ఇస్తానని చెప్పి ఇప్పటికీ 5 సం.రాలు గడుస్తున్న వీధి లేని పరిస్థితుల్లో మేము సమ్మెకు వెళ్లడం జరిగింది.గత 3 నెలల నుండి వివిధ రూపాలలో ప్రతిరోజు మండల,జిల్లా స్థాయి లలో తాసిల్దార్ కు, కలెక్టర్ కు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చాం కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా చేశాము.దీనివలన కేటీఆర్ చర్చలకు పిలిచి రెండు రోజులు టైం అడిగి ఆ రెండు రోజుల తర్వాత కూడా జరిగిన చర్చల్లో మీరు సమ్మె విరమిస్తేనే మేము పే స్కేల్ గూర్చి ఆలోచిస్తాం…లేకుంటే తెగేదాకా లాగొద్దు అని హెచ్చరించారు.ఆయన మేము భయపడక సమ్మెను కొనసాగిస్తూ వచ్చాము.ఈ 3 నెలల సమయంలో పే స్కేల్ వస్తదో రాదో అని మనోవేదనతో 70 మంది వీఆర్ఏలు మరణించడం జరిగింది.చర్చలు ఫలించక కాలయాపన చేయడం వలన మా వీఆర్ఏల కుటుంబాలలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా అప్పులు బాగా పెరిగి పండుగకు కూడా అప్పు ఇచ్చేవారు లేక శిబిరం వద్దనే పండుగలు చేసుకోవడం జరిగింది.పిల్లలకు ఫీజు కట్టలేక వారి చదువులకు ఆటంకం కలుగుచున్నది.ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొని కుటుంబ సభ్యులు మరణించడం జరిగింది.ఈ కారణాలవల్ల సీఎం కెసిఆర్ స్పందించాలని మా యొక్క కార్యక్రమాలను ఉదృతం చేయడం జరిగింది.దీనిలో భాగంగా ఈరోజు తహసిల్దార్ కార్యాలయం ముట్టడించడం జరిగింది.సీఎం కేసీఆర్ మా వీఆర్ఏల కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలను పిల్లల చదువులను ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 23 వేల కుటుంబాల తరఫున కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం సభ్యులు పాల్గొన్నారు