తహసిల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన వీఆర్ఏలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై గత మూడు అసెంబ్లీ సమావేశాలలో మాటిచ్చి నేటి వరకు కూడా అమలు చేయకపోవడం వీఆర్ఏల జీవితంలో ఆందోళన కలిగిస్తుందని వీఆర్ఏల సంఘం డివిజన్ అధ్యక్షులు దుగుంట్ల  శ్రీనివాస్ రావు అన్నారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయ గేట్ కి తాళం వేసి శాంతియుత నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ అర్హత గల వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పిస్తూ పే స్కేల్ వర్తింప చేస్తామని , 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పిస్తామని నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మూడుసార్లు చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సందీప్, ప్రధాన కార్యదర్శి సతీష్, సెక్రటరీ మురళి, కోశాధికారి శ్రావణ్ కుమార్, సభ్యులు నర్మదా, వనిత, శిరీష, యాకు పాషా, రవి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.